ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. మావోయిస్టుల ఘాతుకానికి 10 మంది పోలీసులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/CHATISGHAD.jpg)
రాయ్‌పూర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసు వ్యానును ఐఇడితో పేల్చి వేశారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్, 10 మంది పోలీసులు మృతి చెందారు. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్() ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తుండగా.. మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు పోలీసుల వాహనాన్ని ఐఇడితో పేల్చివేశారు. దీంతో 11 మంది అక్కడకక్కడే మరణించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
భద్రతా బలగాలపై దాడులు చేస్తామని నక్సల్స్ పేరుతో గతవారం పోలీసులకు ఓ బెరింపు లేఖ వచ్చినట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఈ లోగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఘటనపై ముఖ్యమంత్రి తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.