నిజామాబాద్‌లో ఆటోను ఢీకొన్న గూడ్స్ ట్రాలీ.. న‌లుగురు మృతి

నిజామాబాద్ (CLiC2NEWS): ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆటోను గూడ్స్ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. బోధ‌న్ నుండి నిజామాద్ వెళ్తున్న ఆటో ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మ‌రో వ్య‌క్తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మ‌రో న‌లుగురికి గాయాల‌య్యాయి.ప్ర‌మాద సమ‌యంలో ఆటోలో 8 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే గూడ్స్ ట్రాలీ డ్రైవ‌ర్ ప‌రార‌యిన‌ట్లు స‌మాచారం. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లంలో వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.