అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు పెంపు!

అమెజాన్ ప్రైమ్ త‌మ‌ యూజ‌ర్ల‌కు షాకిచ్చింది. నెల‌వారీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర‌లు భారీగా పెంచింది. నెల‌వారీ స‌బ్ స్క్రిప్ష‌న్ తోపాటు.. త్రైమాసిక ప్లాన్‌ను కూడా పెంచేసింది. వార్షిక ప్లాన్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెజాన్ ప్రైమ్ నెల‌వారీ స‌బ్ స్క్రిప్ష‌న్ రూ. 179 కాగా.. తాజాగా రూ. 299 ల‌కు పెంచింది. త్రైమాసిక (మూడు నెల‌ల‌) స‌బ్ స్క్రిప్ష‌న్ రూ. 459 నుండి 599 కి పెంచింది. పెరిగిన ఛార్జీలు త‌క్ష‌ణ‌మే అమలులోకి రానున్నాయి. ఇప్ప‌టికే స‌బ్ స్క్రిప్ష‌న్ పొందిన వారికి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు పాత ధ‌ర‌లే అమ‌లులో ఉండ‌నున్నాయి. ఏ కారణంచేత‌ను రెన్యువ‌ల్ ఫెయిలైతే కొత్త టారిఫ్ ప్లాన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.