వాతావరణ శాఖ: ఆ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక జారీ..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటె 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.