మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశాలు
హైదరాబాద్ (CLiC2NEWS): వారం రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తునలు త్వరగా పరిశీలించి.. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంపై బిఆర్‌కె భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని, దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి.. వారి జీవితాల్లో ఆనందం చూడాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని తెలిపింది.