ఒకటి, రెండు కాదు.. ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంగా 154 రాళ్లు..!
హైదరాబాద్ (CLiC2NEWS): ఓ వ్యక్తి కిడ్నీలో ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 154 రాళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో ఆ వ్యక్తికి శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు 154 రాళ్లను తొలగించారు. రామగుండంకు చెందిన వ్యక్తికి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజి అండ్ యూరాలజి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతని కిడ్నీలో 62 ఎంఎం, 39 ఎంఎం రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించి..ఎండోస్కోపి సర్జరీ చేసి ముందుగా ఆ రాళ్లను బ్లాస్ట్ చేశారు. అనంతరం మిగతావాటిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు.