రేపే నూతన సచివాలయం ప్రారంభం..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చారిత్రాత్మకమైన సచివాలయం రేపు ప్రారంభించనున్నారు. డా. బి ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సచివాలయం దేశంలోనే మొట్టమెదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడం అని తెలిపారు.
నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి కెటిఆర్ ముఖ్యమైన దస్త్రంపై తొలి సంతకం చేయనున్నట్లు సమాచారం. నూతన సచివాలయంలోని మూడో అంతస్తులోని కార్యాలయం నుండి మంత్రి తన విధులను నిర్వర్తించనున్నారు. హైదరాబాద్ నగరంలోని లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ మార్గదర్శకాల దస్త్రంపై మొద`టి సంతకం ఆదివారం మధ్యాహ్నం చేయనున్నారు.