నూత‌న స‌చివాల‌యాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర నూత‌న స‌చివాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదివారం ప్రారంభించారు. స‌చివాల‌య ప్ర‌ధాన గేటు వ‌ద్ద సిఎం కెసిఆర్‌కు వేద మంద్రోచ్ఛార‌ణ‌ల‌తో వేద‌పండితులు స్వాగతం ప‌లికారు. తొలుత యాగ‌శాల పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం స‌చివాల‌యాన్ని ప్రారంభించారు. స‌చివాల‌యంలోని ఆరో అంస్తులోని త‌న ఛాంబ‌రుకు వెళ్లి ప‌లు ఫైళ్లపై సంత‌కాలు చేశారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, సిఎస్ , స్పీక‌ర్ మండ‌లి ఛైర్మ‌న్, డిజిపి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొని సిఎంకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.