మాల్దీవులకు భారత్ కానుక..!
ఢిల్లీ (CLiC2NEWS) : మాల్దీవులకు గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాప్ట్‌ను భారత్ కానుకగా పంపనుంది. ఈ మేరకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మాల్దీవులతో బంధాన్ని పెంపొందించుకొనేందుకు రక్షణ మంత్రి పర్యటన మైలురాయిగా నిలుస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షడు ఇబ్రహీం సోలీహ్ ఆహ్వానం మేరకు రాజ్‌నాథ్ సింగ్ పర్యటన జరగనుంది. రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల విదేశింగ మంత్రి అబ్దుల్ షహీద్, రక్షణ శాఖ మంత్రి మారియా దీదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సామర్ధ్యాలను పెంచే క్రమంలో గస్తీనౌక, ల్యాండింగ్ క్రాప్ట్ లను మాల్దీవులకు బహుకరించనున్నట్లు తెలుస్తోంది.