ఉచితంగా `నందిని`పాలు.. ఉచిత సిలిండ‌ర్లు: క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు బిజెపి ఎన్నిక‌ల హామీలు

బెంగ‌ళూరు (CLiC2NEWS): క‌న్న‌డ నాట ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. ఈ క్ర‌మంలో రాజ‌కీయ పార్టీలు ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఓట‌ర్ల‌కు ప‌లు ర‌కాల `ఉచితాల`ను ప్ర‌క‌టిస్తున్నాయి.
తాజాగా అక్క‌డి అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి ) ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. పేద‌ల ప్ర‌జ‌ల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు, రాష్ట్రంలో ఉమ్మ‌డిపౌర‌స్మృతి అమ‌లు, 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని బిజెపి హామీల వ‌ర్షం కురిపించింది. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జెపి న‌డ్డా సోమ‌వారం క‌ర్ణాట‌క రాష్ట్ర బిజెపి ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆ రాష్ట్ర సిఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై, సీనియ‌ర్ నాయ‌కుడు య‌డియూర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.

మేనిఫెస్టోలోని ప్ర‌ధాన అంశాలు..

  • క‌న్న‌డ నాట ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లు
  • ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు
  • పేద‌ల‌కు ప్ర‌తిరోజు ఉచితంగా అర లీట‌రు నందిని పాలు
  • పేద కుటుంబంలోని ప్ర‌తి వ్య‌క్తికి 5 కిలోల బియ్యం, 5 కిలోల తృణ ధ్యాన్యాలు
    దారిద్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న కుటుంబాల‌కు ప్ర‌తీ ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలెండ‌ర్లు (ఉగాది, వినియ‌క చ‌వితి, దీపావ‌ళికి ఒక్కొక్క‌టి)
  • మైసూర్‌లోని ఫిల్మ్ సిటీకి దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు
  • నిరాశ్ర‌యుల‌కు 10ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాల కేటాయింపు
  • వృద్ధుల‌కు ఉచితంగా వార్షిక హెల్త్‌చెక‌ప్‌లు
Leave A Reply

Your email address will not be published.