ఆ విషం ఖరీదు రూ. 13 కోట్లు..
కోలకత్తా (CLiC2NEWS) : బంగ్లాదేశ్ నుండి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న విలువైన పాము విషాన్ని బిఎస్ ఎఫ్ దళాలు పట్టుకున్నారు. ఓ సీసాలో కోబ్రా పాము విషాన్ని ఉంది. దానిపై ‘మేడ్ ఇన్ ఫ్రాన్స్’ అని రాసి ఉంది. ఆ విషం ఖరీదు సమారు రూ. 19 కోట్లు. స్మగ్లర్ల గురించి వచ్చిన సమాచారంతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది కాపు కాశారు. ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిపై సిబ్బంది కాల్పులు జరిపారు. స్మగ్లర్లు అక్కడినుండి పారిపోయారు. ఆ ప్రాంతంలో దొరికిన ఒక సీసాలో కోబ్రా సర్పానికి చెందిన విషం ఉంది. దీనిని అటవీ అధికారులకు అందజేసినట్లు సమాచారం.