వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్..

హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలోని విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమి పాఠశాలల్లోని విద్యార్థులకు వర్క్ బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్‌బుక్స్‌ను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. విద్యార్థులందరికీ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అందేలా చూడాలిన అధికారులను ఆదేశించారు.
గతంలో పాఠ్యపుస్తకాల పంపిణీకి రూ. 132 కోట్లు ఖర్చు కాగా.. వచ్చే విద్యాసంవత్సరానికి దాదాపు రూ. 200 కోట్లతో ఉచితంగా బుక్స్ పంపిణీ చేయనున్నారు. విద్యాసంవత్సం ప్రారంభమయ్యే నాటికి రూ. 150 కోట్లతో విద్యార్థులందరికీ ఒక్కొక్కరికీ రెండు జతల యూనిఫామ్స్ అందజేయాలని ఆదేశించారు.