కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడి ఇంట్లో మామిడి చెట్టుపై నోట్లకట్టలు..!

మైసూరు (CLiC2NEWS): మైసూరులోని ఓ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడి ఇంట్లోని మామిడి చెట్టుపై నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. చెట్టుపై ఉన్న ఒక బాక్సులో కోటి రూపాయల నగదును ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్ణాటకలో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదును ఉంచడం కాని.. తరలించడం కాని అనుమతి లేదు. దీనికి విరుద్ధంగా పత్రాలు లేని సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ఇప్పటి వరకు రూ. 110 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మైసూరులోని కాంగ్రెస్ నేత అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్యరాయ్ ఇంటిలో ఐటి అధికారులు తనిభీలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్లుపై ఒక బాక్సును గుర్తించారు. దానిలో రూ. కోటి నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.