మందు బాబుల‌కు గుడ్‌న్యూస్‌..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS):  తెలంగాణ స‌ర్కార్ మందుబాబుల‌కు శుభ‌వార్తనందించింది.
రాష్ట్రంలో మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. బీర్ మిన‌హా లిక్క‌ర్‌కు చెందిన అన్ని బ్రాండ్ల మద్యం ధ‌ర‌లు త‌గ్గించిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అధిక ధ‌ర‌లు ఉండ‌టం వ‌ల‌న ఇత‌ర రాష్ట్రాల‌నుండి రాష్ట్రంలోకి లిక్క‌ర్ అక్ర‌మంగా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ అక్ర‌మ ర‌వాణాను నియంత్రించేందుకు ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌లు తగ్గించిన‌ట్లు తెలుస్తోంది.

మద్యంపై ప్ర‌భుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించ‌డంతో పుల్ బాలిల్‌పై రూ. 40, హాఫ్ బాలిల్‌పై రూ.20, క్వార్ట‌ర్ బాటిల్‌పై రూ. 10 రూ చొప్పున తగ్గాయి. కొన్ని ర‌కాల బ్రాండ్స్‌పై రూ. 60 వ‌ర‌కు త‌గ్గించిన‌ట్లు ఆబ్కారీ అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.