అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. 8 మంది మృతి
వాషింగ్టన్ (CLiC2NEWS): అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగర శివారులోని ఓ మాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా 8 మంది మరణించారు. మరో 7 గురు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిలో 5 గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టెక్సాస్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఒక వ్యక్తి తుపాకీని పేలుస్తూ మాల్లోకి ప్రవేశించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించారు. దుండగుడు జరిపిన కాల్పులకు సంబంధించిన విడీయోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.