కాలువలో కరెన్సీ నోట్లు.. ఎగబడ్డ జనం!
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/sasaram-notes.jpg)
రోహతాస్(బిహార్) (CLiC2NEWS): బిహార్ రాష్ట్రంలోని రోహతాస్ జిల్లా సాసారామ్ పట్టణ పరిధిలో ఉన్న సోన్ హైలెవల్ కాలువలో కరెన్సీ నోట్లు ప్రవహించాయి. శనివారం జరిగిన ఈ ఘటనతో స్థానికులు నోట్ల వేటలో పడ్డారు. కెనాల్లో చేపలు పట్టేందుకు మొరాదాబాద్ వంతెన వద్దకు వెళ్లిన కొందరు స్థానికులకు డబ్బుల నోట్ల మూట ఒకటి కనిపించింది. దాంతో ఈ విషయం సాసారామ్ పట్టణం అంతా వ్యాపించింది. ఇక ప్రజలంతా నోటలో పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.