పురానాపూల్ వంతెనకు పగుళ్లు..
హైదరాబాద్ః రాజధాని హైదరాబాద్‌లో కురిసిన భారా వర్షాలకు పురానపూల్ వద్ద మూసీనది వెంతనకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వంతెనను మూసివేశారు. శనివారం కురిసిన భారీ వర్షానికి మూసీలో వరద ఉధృతి పెరగడంతో ఒకచోట పిల్లర్ స్వల్పంగా కుంగింది. జియాగూడ, కార్వాన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పూరానాపూల్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు. కాగా, వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నికల్ టీంను రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు వరద తాకిడికి మీర్‌పేట చెరువకట్ట బలహీన పడింది. దీంతో కొట్టుకుపోతుందన్న అనుఆనంతో అక్కడి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మీర్‌పేట పరిధిలోని చెరువులకు వరద ఉధృతి పెరిగింది. పెద్ద చెరువు, మంత్రాల, సందె చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మీర్‌పేట చెరువు కట్ట బలహీనంగా మారింది. జలదిగ్బంధంలోనే పదుల సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలిస్తున్నారు. చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని ప్రజలను కార్పొరేటర్లు అప్రమత్తం చేస్తున్నారు. ట్రాక్టర్లతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.