ఇంటిపై కూలిన యుద్ధ విమానం.. ముగ్గురు మృతి
జైపుర్ (CLiC2NEWS): భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదవ శాత్తు కూలిపోయింది. రాజస్థాన్‌లోని హనుమాన్ గఢ్ జిల్లాలోని ఓ ఇంటిపై
సోమవారం యుద్ధ విమానం పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం సూరత్ గఢ్ ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అయిన కొంతసోపటికే డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. విమానంలోని సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన ఫైలగ్.. పారాచూట్ సాయంతో విమానం నుండి బయటకు దూకేశాడు. అతను క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. కానీ విమానం కూలిపోవడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.