వంతెన పై నుంచి బ‌స్సు బోల్తా.. 22 మంది మృతి

ఇండోర్ (CLiC2NEWS): మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని ఖ‌ర్గోవ్ జిల్లాలో ఘోర ప్ర‌మోదం చోటుచేసుకుంది. జిల్లాలో ఓ ప్ర‌యివేటు బ‌స్సు వంతెన పై నుంచి న‌దిలో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 22 మంది మృతి చెందారు. మ‌రో 20 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఖ‌ర్గోన్ నుంచి బ‌స్సు ఇండోర్ వెళ్లుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఘ‌ట‌న సమ‌యంలో బ‌స్సులు దాదాపు 50 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.
విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స్థానికుల సాయంతో క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎంపి సిఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో మృతిచెందిన కుటుంబాల‌కు రూ. 4 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయ్ం ప్ర‌క‌టించారు. అలాగే ప్ర‌ధాని మోడీ కాక‌ర్యాల‌యం కూడా మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం, క్ష‌త‌గాత్రుల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.