పాకిస్థాన్ మాజీ పిఎం ఇమ్రాన్ ఖాన్ అరెస్టు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/imran-khan.jpg)
ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పిటిఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను పాక్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోర్టు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టును సామాన్యులతో పాటు పలువురు లాయర్లు కూడా అడ్డుకున్నారు. దీంతో అక్కడ జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.