పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ చేస్తుండగా.. డాక్ట‌ర్‌ను చంపిన రోగి

తిరువ‌నంత‌పురం (CLiC2NEWS): కేర‌ళ‌లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స చేస్తున్న‌ వైద్యురాలిపై ఓ పేషెంట్ విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడిచేశాడు. ఈ దాడిలో యువ‌ వైద్యురాలు మృతి చెందారు. కొట్ట‌ర‌క్క‌ర‌లోని ఆస్ప‌త్రిలో వంద‌నాదాస్ అనే యువ వైద్యురాలు హోస్ స‌ర్జ‌న్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం కాలిన గాయాల‌తో వ‌చ్చిన పేషెంట్‌కు డ్రెస్సింగ్ చేస్తుండ‌గా.. అత‌ను అక‌స్మాత్తుగా వైద్యురాలిపై క‌త్తెర‌తో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఘ‌ట‌న‌పై భార‌తీయ వైద్య మండ‌లి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 24 గంట‌ల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. అయితే అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్రం అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న చేసింది.

నిందితుడు అంత‌క‌ముందు కుటుంబ‌స‌భ్యుల‌తో గొడ‌వ‌ప‌డ‌గా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌నిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రి తీసుకొచ్చారు. నిందితుడు వైద్యురాలిపైనే కాకుండా అక్క‌డున్న పోలీసుల‌ను కూడా గాయ‌ప‌రిచాడు. నిందితుడు ఒక పాఠ‌శాల ఉపాధ్యాయుడు.. అయితే అత‌ను ప్ర‌స్తుతం స‌స్సెండ్ అయినట్లు స‌మాచారం.

వైద్యురాలి హ‌త్య‌పై రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ప్ర‌త్యేక సెష‌న్ ఏర్పాటు చేసి ఈ కేసును అత్య‌వ‌స‌రంగా విచార‌ణ చేప‌ట్టింది. ఇది వ్య‌వ‌స్థ లోప‌మ‌ని.. ఒక వ్య‌క్తి అసాధారణంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌పుడు అత‌నిని అదుపులో ఉంచాలి. అనూహ్య ఘ‌ట‌న‌లు మీరు ఊహిచంగ‌ల‌గాలి. అలా లేన‌పుడు పోలీసులు ఎందుకు అని ప్ర‌శ్నించింది. ఇపుడు వైద్యులు స‌మ్మెకు దిగారు. దీనివ‌ల్ల ఏ పేషెంట్‌కైనా న‌ష్టం జ‌రిగితే డాక్ట‌ర్ల‌ను నిందించ‌గ‌ల‌మా అని ప్ర‌భుత్వాన్ని పోలీసు విభాగాన్ని మంద‌లించింది.

Leave A Reply

Your email address will not be published.