TS: దోస్త్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 విడతల్లో ఈ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు కన్వీనర్ తెలిపారు. ఈ నెల 16 వ తేదీ నుండి 10వ తేదీవరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. మే 20వ తేదీ నుండి జూన్ 11 వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. మొదటి విడత సీట్ల కేటాయింపు జూన్ 16వ తేదీ నుండి మొదలవుతుంది.