పైసా.. పవర్ పనిచేయలేదుః మల్లికార్జున ఖర్గే
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. భారీ మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ గెపులు సాధించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మీడియాతో మాట్లాడారు. . ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి స్వయంగా వచ్చి మద్దతు ఇచ్చారని తెలిపారు. ఓటర్లు అవినీతి సర్కారుకు వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా , పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సిఎం లు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు.. అయినా కానీ ప్రజలు కలిసి కట్టుగా కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. ఇది సమష్టి విజయం అని ఖర్గే తెలిపారు.