చికెన్ ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన రేట్లు
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/chicken.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మార్కెట్లో కోడి మాంసం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గతంలో ఎప్పూడూ లేని విధంగా ధరలు పెరగడంలో కోడిమాంసం ప్రియలు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగిగా కోడి మాంసం ధరలకు రెక్కలు రావడంతో మాంసం ప్రియులు జేబులు పట్టుకుంటున్నారు. సాధారణంగా వేసవి కాలంలో కోడి మంసం ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈ సీజన్లో ధరలు మరీ అధికంగా పెరగడంతో నాన్ వెజిరియన్ వాసులు ఎమి కొంటాం.. చికెన్ ఎమి తింటాం అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత వారం బాయిలర్ మాంస కిలో. రూ.200 నుంచి 210 వరకు ధర ఉండేది. కానీ ఈ వారం బాయిలెర్ మాంసం కిలో ధర రూ. 280 నుంచి 285 వరకు పలుకుతోంది.
అలాగే ఫారమ్ కోడి రూ. 150 నుంచి రూ. 170 వరకు ఉంది. అలాంటిది ఈ వారం ఫారం కోడి కిలో మాంసం రూ. 200 దాటింది.
గడ్డు ధరలదీ అదేదారి..
చికెన్ రేట్లతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. పది రోజుల కిందట రూ. 4 లోపు పలికిన గుడ్డు ధర.. ఈ వారం రూ. 5 కు చేరింది.
అట్ట కోడి గుడ్ల ధర రూ. 120 పలకగా.. వాటి ధర ప్రస్తుతం రూ. 150 వరకు చేరింది. చికెన్ ధరలు, కోడి గుడ్ల ధరలు పెరగడంతో మాంసం ప్రియులు పెదవి విరుస్తున్నారు.