నంద్యాల జిల్లాలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
నంద్యాల (CLiC2NEWS): జిల్లాలోని అవుకు జలాశయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ జలాశయంలో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి ఆచూకీ గల్లంతయింది. 12 మంది పర్యాటకులతో కూడిన పడవ అవుకు జలాశయంలోకి వెళ్లింది. ఒక్కసారిగా నీరు రావడంతో పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలికి చేరుకుని గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీని కోసం గజ ఈతగాళ్లను కూడా రప్పించినట్లు సమాచారం. ఇప్పటి వరకు 11 మంది పర్యాటకులను బయటకు తీసుకొచ్చారు. వారిలో ఆశాబి (28) అనే మహిళ ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వత చికిత్స పొందుతూ మృతి చెందింది. బనగానపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతు నూర్జహాన్ (37) అనే మహిళ మృతి చెందింది. కాగా ఈ ఘటనకు సంబంధఙంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.