కొత్తగూడెం జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైన మూడు డయాలసిస్ సెంటర్లు..
హైదరాబాద్ (CLiC2NEWS): భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్ల అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సెంటర్లు సరిపోకపోవడంతో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సౌకర్యార్థం మరో మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని మణుగూరు లోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, ఇల్లందులోని కమ్మూనిటి హెల్త్ సెంటర్, అశ్వారావుపేటలో.. మొత్తం మూడు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించనున్నారు.
మణుగూరు, ఇల్లందులోని డయాలసిస్ సెంటర్లను బుధవారం ప్రారంభించనున్నారు. అశ్వరావుపేటలోని మూడవతి ఈ నెలాఖరు వరకు ప్రారంభించనున్నట్లు సమాచారం. కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో.. భద్రాచలం గవర్నమెంట్ ఏరియా హాస్సిటల్‌లో కిడ్నీ రోగులకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. బాధితులు ఎక్కువవడంతో కొత్తగా మూడు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
Reacher star Alan Ritchson joins the cast as Agent
Aimes, the new leader of the company run by Mr Nobody.