అంగన్వాడీలో ఊయలూగుతూ.. బాలుడు మృతి

కాకినాడ (CLiC2NEWS): ఊయలే ఉరితాడై ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. జిల్లాలోని గొల్లపాలెం అంగన్వాడీలో ఓ బాలుడు ఊయల ఊగుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. తన చెల్లిని అంగన్వాడీ కేంద్రం నుండి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అక్కడ టీచర్ లేకపోవడంతో అంగన్వాడీలో సహాయకురాలు పిల్లల కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో బాలుడు గదిలో ఉన్నటువంటి తూకం ఉయ్యాల ఎక్కి ఊగుతూ.. ఉయ్యాల తాడు అతని మెడకు చుట్టుకుని ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.