ఇదే నా చివరి ట్వీట్ కావొచ్చు!
పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారుః పాక్ మాజీ పిఎం ఇమ్రాన్ ఖాన్
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/imran-khan.jpg)
ఇస్తామాబాద్ (CLiC2NEWS): మన పొరుగుదేశం పాకిస్థాన్లో ఆదేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. ఈ మధ్యనే ఆయన్ను అరెస్టు చేసి.. అక్కడి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా ఆయన ట్విట్టర్లో చేసిన పోస్టు ఆయన అభిమానులను, పార్టీ నాయకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా ఇమ్రాన్ మరోసారి అరెస్టయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా ఆయన తన ఇంటిని చుట్టూ భారీగా పోలీసులను మోహరించారని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇదే తన చివరి ట్విట్ కావచ్చంటూ కూడా ఇమ్రాన్ ట్వీట్ చేశారు.
అలాగే తన అరెస్టు అనంతరం దేశంలో చెలరేగిన హింసపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో.. అలాగే సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు తనతో పాటు తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.