`బలగం` మొగిలయ్యకు `దళితబంధు`కింద కారు..
కారు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
హైదరాబాద్ (CLiC2NFEWS): ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో `బలంగం` సినిమా ఓ సంచలనం. ఆ సినిమాలో తెలంగాణ పల్లెల కట్టుబాట్లు, సంప్రదాయాలు, ప్రేమాభిమానాలను కళ్లకు కట్టినట్టు చూపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే.. తెలంగాణతో పాటు, ఎపి, ప్రపంచంలోని తెలువారందరిని ఎంగానో ఈ సినిమా పాటలు అలరించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అందరి మనసులను ఒక్కసారిగా కదలించింది ఆఖరి పాట. ఇంత అద్భుతమైన పాట పాడిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ సర్కార్ దళిత బంధు పథకం కింద కారును పంపిణి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున దళిత బంధు పథకం కింద పస్తం కొమురయ్య దంపతులకు కారును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బలగం సినిమాలో అద్భుతంగా పాటపాడిన మొగిలయ్య కొమురమ్మలకు కెసిఆర్ అండగా నిలిచారని తెలిపారు. మొగిలియ్య ఆరోగ్యం బాగు కోసం నిమ్స్‌లో చేర్పించి వైద్యం చేయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు సిఎం కెసిఆర్ కు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.