హిందూజా గ్రూప్ చైర్మన్ పరమానంద్ కన్నుమూత
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/hinduja-s-paramanand.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్ పరామానందన్ హిందూజా కన్నమూశారు. ఈ మేరకు ఆయన మృతిని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలిజయేశారు. సిరిచంద్ పరమానంద్.. నలుగురు హిందూజా అన్నదమ్ములలో పెద్దవారు. హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఉన్న ఆయన లండన్‌లో ఉంటూ బ్రిటిష్ పౌరసత్వం పొందారు.
“ పిడి హిందూజా వ్యవస్థాపక నియమాలు, విలువలను దిగ్విజయంగా కొనసాగించిన ఎస్ పరమానందన్ హిందూజా మా కుటుంబానకిఇ మార్గదర్శకుడిగా నిలిచారు. యుకె, స్వదేశమైన భారత్‌ల మధ్య బలమైన బంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి ప్రముఖ పాత్ర పోషించారు.“ అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనను విడుదల చేసింది.