గంగూలీకి జడ్ కేటగిరీ భద్రత
కోల్‌కతా (CLiC2NEWS): టీమిండియా మాజీ సారథి, బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇకపై జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని బెగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రత రానున్న మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ భద్రతపై సమీక్ష నిర్వహించి స్థాయి పెంచినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 21 తేదీ నుంచి గంగూలీకి ఈ భద్రతను కల్పించనున్నారు.