లోకేశ్‌కు ఎంఆర్ఐ స్కానింగ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌కు నంద్యాల‌లోని ఓ ఎంఆర్ ఐ సెంటర్‌లో ఆయ‌న కుడి భుజానికి స్కానింగ్ చేశారు. ప్ర‌స్తుతం లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర నంద్యాల నియోజ‌క వ‌ర్గంలో కొన‌సాగుతోంది. గ‌త కొన్ని రోజులు గా ఆయ‌న భుజ‌నం నొప్పితో బాధప‌డుతున్నారు. పాద‌యాత్ర క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల తోపులాట‌లో లోకేశ్ కుడి భుజానికి గాయ‌మైంది. ఫిజియో థెర‌పి వైద్యుల సూచ‌న మేర‌కు ప‌లు ప్రికాష‌న్స్ తీసుకున్నా ఆయ‌న‌కు నొప్పి త‌గ్గ‌లేదు. దాంతో గ‌త 50 రోజులుగా నొప్పితో బాధ‌ప‌డుతూనే పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైద్యుల సూచ‌న మేర‌కు ఆయ‌న కుడి భుజానికి స్కానింగ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.