డిప్యూటీకి ఢికె ఓకే!
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/DK-SHIVAKUMAR.jpg)
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎట్టకేలకు కర్ణాటక రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి దేశంలో ని ప్రముఖ మీడియా సంస్థలతో పాటు సామాన్యుల మధ్య కూడా సిఎం ఎవరు అనే చర్చ సాధారణం అయిపోయింది. ముఖ్యమంత్రి కుర్చీ తప్ప మరే పోస్టు అవసరం లేదని భీష్మించుకుని కూర్చున్న కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డి కె శివకుమార్ ఎట్టకేలకు రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. నిన్న అర్థరాత్రి దాటిన తర్వాల పార్టీలో ఏకాభిప్రాయం కుదిరినట్లు కాంగ్రెస్ వర్గాలు గురువారం వెల్లడించాయి. మొదట కర్ణాటక సిఎంగా సిద్ద రామయ్య, డిప్యూటీ సిఎంగా డికె శివకుమార్‌ను ఎంపిక చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ దీనిపై పార్టీ అధికారిక ప్రకటించలేదు.