111 జిఒ పూర్తిగా ఎత్తివేత‌

బిసి కుల వృత్తుల కుటుంబాల‌కు రూ. ల‌క్ష సాయం:
హుస్సేన్ సాగ‌ర్‌కు గోవదావ‌రి జ‌లాలు
తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ మంత్రివ‌ర్గం తొలిసారి కొత్త స‌చివాల‌యంలో సిఎం కెసిఆర్ అధ్య‌క్షత‌న జ‌రిగింది. ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రి వ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల బ‌హుమ‌తిగా బిసి కుల‌వృత్తుల వారికి కుటుంబానికి రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యించింది. విధివిధానాలు రూపొందించేదుకు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అధ్య‌క్ష‌త‌న మంత్రి వ‌ర్గ ఉప సంఘాన్ని నియ‌మించింది. దీనిలో మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ప్ర‌శాంత్‌రెడ్డి స‌భ్యులు గా ఉంటారు.
రాష్ట్ర అవ‌ర‌ణ ఉత్స‌వాల‌ను 21 రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌వాల‌ను అన్ని జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో సంబురాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో ని జంట జ‌లాశ‌యాల ప‌రిర‌క్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన 111 జివోను పూర్తిగా ఎత్తివేసింది. దాని ప‌రిధిలోని దాదాపు 84 గ్రామాల‌కు హెచ్ ఎం డి ఎ ( హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాభివృద్ధి సంస్థ‌) నిబంధ‌న‌లు వ‌ర్తింప‌జేయాల‌ని సూచించింది. గంటిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్‌, మూసీ, హుస్సేన్‌సాగ‌ర్‌ల‌కు గోదావ‌రి జ‌లాల‌ను అనుసంధానం చేయాల‌ని నిర్ణ‌యించింది. మంత్రివ‌ర్గం వి ఆర్ ఎల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు ఆమోదించింది. మంత్రి మండ‌లి భేటీ అనంత‌రం మంత్రులు హ‌రీష్‌రావు, గంగుల క‌మలాక‌ర్‌, త‌ల‌సాని, ప్ర‌శాంత్‌రెడ్డిలు మీడియాకు వివ‌రాల‌ను తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.