రూ. 2000 నోట్లు ఉప‌సంహ‌ర‌ణ‌.. ఆర్‌బిఐ కీల‌క నిర్ణ‌యం

ఢిల్లీ (CLiC2NEWS): రూ. 2వేల నోట్ల చ‌లామ‌ణి ఉప‌సంహ‌రించుకోవాల‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నోట్ల‌ను మార్చుకునేందుకు ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 23 వ‌ర‌కు గ‌డువిచ్చింది. వినియోగ‌దారుల‌కు రూ. 2 వ‌లే నోట్లు ఇవ్వొద్ద‌ని బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేసింది. నోట్ల‌ను ఏ బ్యాంకులోనైనా మార్చుకునేందుకు వీలు క‌ల్పించింది. సెప్టెంబ‌ర్  23 వ‌ర‌కు ఈ నోట్లు చెల్లుబాటవుతాయ‌ని, ఈ నాలుగు నెల‌ల‌లో నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవ‌డంగాని..  మార్చుకోవ‌డం గాని చేయాల‌ని ఆర్‌బిఐ సూచించింది.

పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత క‌రెన్సీ నోట్ల డిమాండుకు స‌రిప‌డా క‌రెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా రూ. 2000 నోట్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంత‌రం అవ‌స‌ర‌మైన క‌రెన్సీ అందుబాటులోకి రాగానే.. ఈ నోట్లను ముద్రించ‌డం నిలిపివేశారు. రూ. 2 వేల నోట్లు 2017 మార్చికి ముందు ముద్రించిన‌వే. వీటి జీవితకాలం 4-5 ఏళ్లు మాత్ర‌మే. 2018 -19 నుండి ఈ నోట్లును ముద్రించిడం నిలిపివేసిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌జ‌లు ఒకే సారి రూ. 20 వేలు వ‌ర‌కు మార్చుకోవ‌చ్చు. ఒక బ్రాంచిలో రూ. 20వేల మాత్ర‌మే మార్చుకోవ‌డానికి వీలుంటుంది. బ్యాంకుల్లో నోట్ల‌ను ఈనెల 23 నుండే డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని ఆర్‌బిఐ సూచించింది.

1 Comment
  1. […] రూ. 2000 నోట్లు ఉప‌సంహ‌ర‌ణ‌.. ఆర్‌బిఐ కీల… […]

Leave A Reply

Your email address will not be published.