నిలిపి ఉన్న టిప్ప‌ర్‌ను ఢీకొట్టిన కారు.. న‌లుగురు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌ర శివారు నార్సంగి స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌స్తున్న కారు టిప్ప‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో న‌లుగురు వ్య‌క్తులు ఉన్నారు. ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు, వారి స్నేహితులు ఉన్న‌ట్లు స‌మాచారం.అక్కా చెల్లెళ్లు అర్షిత‌, అంకిత‌ స‌హా కారులో ఉన్న నితిన్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఆస్ప‌త్రిలో మ‌రో వ్య‌క్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శంక‌ర్‌ప‌ల్లి నుండి నార్సింగి వ‌స్తున్న కారు రోడ్డు ప్ర‌క్క‌న నిలిపి ఉన్న టిప్ప‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం సంభవించింది. మ‌ర‌ణించిన వారంతా నిజాంపేట్ వాసులుగా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.