వీధి కుక్కల దాడిలో మరో పసివాడు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/A-CHILD-DEAD.jpg)
కాజీపేట (CLiC2NEWS): వీధి కుక్కలు దాడి చేయడంతో ఏడేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దారుణం కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. మల్కాన్, సునీత దంపతులకు ముగ్గురు సంతానం. ఈ కుటుంబం బనారస్ నుండి రాజస్థాన్‌కు వెళ్లేందుకు బయలు దేరారు. మార్గ మధ్యలో వేరే రైలు ఎక్కేందుకు కాజీపేట రైల్వే స్టేషన్‌లో దిగారు. తెల్లవారుజామున రెండో కుమారుడు కాలకృత్యాలకని రైల్వే స్టేషన్ సమీపంలోని పార్కు వద్దకు వెళ్లగా.. కుక్క ఆ బాలుడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. కుమారుడిని పోగొట్టుకున్న ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించడం.. చూసిన వారందరి కంటతడి పెట్టించింది.
నాలుగు రోజుల క్రితం ఓ బాలికపై , 15 రోజుల క్రితం రైల్వే ఉద్యోగిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలియజేశారు. రైల్వే క్వార్టర్స్‌తో పాటు అక్కడున్న పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉన్నాయని.. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.