TS: జెపిఎస్‌ల క్రమబద్ధీకరణకు సర్కార్ నిర్ణయం
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/TS-logo.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖారారు చేయాలని పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉన్నతాధికారులతో జెపిఎస్‌ల క్రమబద్ధీకరణపై సిఎం చర్చించారు. జూనియర్ పంచాయతీ కారద్యర్శుల పనితీరు మదింపు చేసేందేకు జిల్లా స్థాయి కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు.