బైడెన్‌ను చంపాలని.. 19 ఏళ్ల యువకుడు ఆరు నెలల స్కెచ్..
వాషింగ్టన్ (CLiC2NEWS): అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హత్యచేయాలనే ఉద్దేశ్యంతో ఓ 19 ఏళ్ల యువకుడు యత్నించాడు. నిందితుడు భారత సంతతికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పరిసరాల్లోని ట్రాఫిక్ బారియర్స్‌ను ట్రక్కుతో ఢీకొట్టాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతను ఉద్దేశ్య పూర్వకంగానే దాడికి యత్నించినట్లు అంగీకరించినట్లు సమాచారం. నిందితుడు ముస్సోరిలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్‌గా గుర్తించారు. అతని మానసిక పరిస్థితిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ దాడి కోసం నిందితుడు ఆరునెలలుగా ప్లాన్ చేసి మరీ ఈ ఘటనకు పాల్పడ్డాడు. పోలీసులు అతని వద్దనుండి నాజీ జెండాను స్వాధీనం చేసుకున్నారు. దానిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
నిందితుడిని పోలీసులు విచారించగా.. దాడి ఏవిధంగా చేయాలనేది ఆరు నెలలు నుండి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. దానికి సంబంధించిన విషయాలు తన గ్రీన్ బుక్‌లో రాసుకొన్నట్లు చెప్పాడు. అధికారం కోసం చేసినట్లు తెలియజేశాడు. అధికారం ఎలా దక్కించుకొంటావ్ అని అడిగితే.. అవసరమైతే బైడెన్‌ను చంపేయాలనుకున్నా.. లేదా అక్కడున్న వారిలో ఎవరినైనా గాయపరిచాలనుకున్నట్లు వర్షిత్ తెలిపినట్లు సమాచారం. అయితే.. నిందితుడిపై ఇప్పటి వరకూ ఎలాంటి క్రిమినల్ కేసులు రికార్డు కాలేదు.