బీటెక్ అర్హతతో ఇస్రోలో సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/06/EXAMS.jpg)
బెంగళూరు (CLiC2NEWS): బీటెక్ ఉత్తీర్ణులైన వారికి శుభవార్త. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) లో మొత్తం 303 పోస్టుల భర్తీకి టిఫికేషన్ విడుదలైంది. సైంటిస్ట్/ ఇంజినీర్ ఉద్యోగాలకు అర్హలైన అభ్యర్థుల నుండి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్ మెంట్ బోర్డ్ దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తులను నేటి నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 14గా నిర్ణయించారు.
అభ్యర్థులు కనీసం 65% మార్కులతో బిఇ, బిటెక్లలో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తు రుసుంను రూ. 250లుగా నిర్ణయించారు. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ.. జూన్ 16. 2023 జూన్ 14 నాటికి అభ్యర్థులు 28 ఏళ్లకు మించరాదు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ. 56,100 చొప్పున ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.