సివిల్స్‌లో భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ విజేత‌లే..

తిరువ‌నంత‌పురం (CLiC2NEWS): కేర‌ళ‌కు చెందిన జంట ఆరుదైన రికార్డు సాధించారు. యుపిఎస్‌సి ఫ‌లితాల్లో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ర్యాంకులు సాధించారు. మాళ‌విక జి నాయ‌ర్‌, డా. ఎం. నంద‌గోప‌న్ వ‌రుస‌గా.. 172, 233 ర్యాంకులు సాధించారు. వీరిద్ద‌రికీ 2020లో వివాహం జ‌రిగింది. 2020లోనే మాళ‌విక ఐఆర్ ఎస్‌కు ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆమె మంగ‌ళూరులో ఐటి స‌హాయ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమె త‌ల్లి గెనకాల‌జిస్ట్‌, తండ్రి కేర‌ళ ఫైనాన్షియ‌ల్ కార్పొరేష‌న్‌లో డిజిఎంగా ప‌నిచేశారు. నంద‌గోప‌న్ త‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సీనియ‌ర్ డాక్ట‌ర్‌, తండ్రి ఊఒబిలో చీఫ్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.