వేలంలో రూ. 144 కోట్లు పలికిన టిప్పు సుల్తాన్ ఖడ్గం

మైసూరు (CLiC2NEWS): 18వ శతాబ్ధానికి చెందిన టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఓ ఖడ్గం వేలంలో రూ. 144 కోట్లకు అమ్ముడుపోయింది. లండన్లోని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ మే 23వ తేదీన వేలం వేయగా.. ఈ ఖడ్గం 1,40,80,900 పౌండ్లకు అమ్ముడుపోయింది. భారత్ కరెన్సీలో ఈ మొత్తం రూ. 144 కోట్లకు పైనే ఉంటుంది. దీని కోసం ముగ్గురు బిడ్డర్లు పోటీ పడ్డారు.
గతంలో ఈ ఖడ్గాన్ని విజయ్ మాల్యా కోనుగోలు చేసినట్లు సమాచారం. 2003లో లండన్లోని ఓ ఆక్షన్ హౌస్ నుండి కొనుగోలు చేసి.. తిరిగి మళ్లీ విక్రయించినట్లు సమాచారం. ఆయన పలు బ్యాంకుల్లో రుణాలు ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసినదే. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఆయుధాల్లో ఇది అత్యంత శక్తివంతమైన ఖడ్గం. అయితే దీని పాత యజమాని ఎవరనేది.. ప్రస్తుతం దీన్ని ఎవరు కొనుగోలు చేసింది వివరాలను ఆక్షన్ సంస్థ వెల్లడించలేదు.