మళ్లీ పెళ్లి చిత్రం విడుదల ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి

హైదరాబాద్ (CLiC2NEWS): నరేష్-పవిత్ర జంటగా కలిసి నటించిన చిత్రం మళ్లీపెళ్లి. ఈ చిత్రం మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల ఆపాలంటూ నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రంలోని సన్నివేశాలు తనని కించపరిచేలా ఉన్నాయంటూ.. ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. నరేశ్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో జయసుద, శరత్‌బాబు అన్నపూర్ణ కీలక పాత్రలు పోషించారు.
సినీ నటడు నరేష్, అతని భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో నరేష్-పవిత్ర లోకేశ్‌ను వివాహం చేసుకోబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలో ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం మళ్లీపెళ్లిలో వీళ్లిద్దరూ కలిసి నటించడం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సినిమా నరేశ్‌కు అతని మూడో భార్య రమ్యకు మధ్య జరిగే కాంట్రవర్సీల నేపథ్యంలో అతని రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉండనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నరేశ్ తన హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై తెరకెక్కించారు.