ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు శరత్‌బాబు మరణవార్తను మరవక ముందే ప్రముఖ దర్శకుడు కె. వాసు కన్నుమూశారు. ఆనారోగ్యం కారణంగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ప్రాణం ఖరీదు సినిమాతో చచిరంజీవిని నటుడిగా పరిచయం చేసినది ఈయనే. వాసు దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ఆడపిల్లల తండ్రి .. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కోతల రాయుడు, సరదా రాముడు, పక్కింటి అమ్మాయ, కొత్త దంపతులు, ఆడపిల్ల, పుట్టినిల్లా మెట్టినిల్లా వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ఆయన తెరకెక్కించిన అయ్యప్ప స్వామి మహత్యం, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం సినిమాలలోని పాటలు ఇప్పటికీ అజరామరం.