ఎపి స‌మ‌గ్ర శిక్షా సొసైటి: 1,358 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న టీచింగ్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. పాఠ‌శాఖ విద్యాశాఖ‌లోని స‌మ‌గ్ర శిక్షా సొసైటి నిర్వ‌హించే క‌స్తూర్భా గాంధీ బాలికా విద్యాల‌యాల్లో మొత్తం 1,358 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్ట్ పద్ధతిలో భ‌ర్తీ చేయ‌డానికి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు కోరుచున్నారు. అర్హులైన మ‌హిళా అభ్య‌ర్థులు మే 30వ తుదీ నుండి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ జూన్ 4వ తేదీగా నిర్ణ‌యించారు.

అభ్య‌ర్థులు ఆయా ఉద్యోగాల‌ను బ‌ట్టి డిగ్రి, పిజి, బిఇడి బిపిఇడి ల‌లో ఉత్తీర్ణులై ఉండాలి. వ‌య‌స్సు 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్‌టి ఎస్‌సి బిసిల‌కు ఐదేళ్ల స‌డిలింపు ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు గౌర‌వ వేత‌నం.. ప్రిన్సిపాళ్ల‌కు రూ. 34,139, సిఆర్‌టిల‌కు రూన 26,759, పిజిటిల‌కు రూ. 26759, పిఇటిల‌కు రూ. 26,759 చొప్పున ల‌భిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.