TSPSC కీలక నిర్ణయం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్ పిఎస్‌సి) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసిన 37 మంది ఇకపై టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే ఎటువంటి పరీక్షలు రాయకుండా చేయాలని కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు టిఎస్‌పిఎస్‌సి 37 మందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న 44 మందిపై సిట్ కేసు నమోదు చేసి, 43 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.
[…] TSPSC కీలక నిర్ణయం […]