తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ట్రప‌తి, ప్ర‌ధాన‌మంత్రి శుభాకాంక్ష‌లు

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోడీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలంగాణ ఆవిర్భివించి తొమ్మిదేళ్లు పూర్త‌యి.. ప‌దో ఏడాదిలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, శ్రేయ‌స్సు ఇలాగే కొన‌సాగాల‌ని ఆశిస్తున్నాన‌ని రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము అభినంద‌నలు తెలియ‌జేశారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల నైపుణ్యాలు, సంస్కృతి వైభ‌వం ఎంతో గుర్తింపు పొందాయ‌ని.. తెలంగాణ శ్రేయ‌స్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్ధిస్తున్నాన‌ని ప్ర‌ధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.

 

1 Comment
  1. slot dewa says

    Hi, the whole thing is going well here and ofcourse every one is sharing data, that’s actually fine, keep up writing.

Leave A Reply

Your email address will not be published.