ఒడిశాలో రైలు ప్రమాదం: 280 మంది దుర్మరణం
బాలేశ్వర్ (CLiC2NEWS): ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 280 మంది మృత్యువాత పడ్డారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. చీకటిలో సైతం సహాయక చర్యలు చేపట్టినా.. ఇంకా బోగీలలో ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. మూడు రైళ్లు ఢీకొని భారీ ప్రమాదం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరు హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్సప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద సుమారు రాత్రి 7 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఈ ట్రైన్ బోగీలు ప్రక్క ట్రాక్‌పై పడిపోయాయి. వీటిని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మొత్తం 15 బోగీలు బోల్తాపడిపోయాయి. ఈ బోగీలను గూడ్సురైలు ఢీకొట్టింది. మూడు రైళ్లు ఢీకొని భారీగా ప్రాణనష్టం జరిగింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్ మయూర్‌బంజ్, కటక్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలిస్తున్నారు. మొత్తం 115 అంబులెన్సులలో తరలిస్తున్నట్లు సమాచారం.బోగీలలోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు రిస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
[…] ఒడిశాలో రైలు ప్రమాదం: 280 మంది దుర్మర… […]