సెక్ష‌న్ 124ఎ (దేశ‌ద్రోహం) కేసు జైలు శిక్ష‌ను ఏడేళ్ల‌కు పెంచాల‌ని సిఫార‌సు

ఢిల్లీ (CLiC2NEWS): దోశ‌ద్రోహం కేసులో జైలు శిక్ష‌ను ఏడేళ్ల‌కు పెంచాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లా క‌మిష‌న్ సిఫార్స్ చేసింది. సెక్ష‌న్ 124ఎ (దేశ‌ద్రోహం) కింద కేసు న‌మోదైతే ఐపిసి కింద నేర‌స్థులు పాల్ప‌డిన నేరాన్ని బ‌ట్టి వారికి శిక్షను న్యాయ‌స్థానం ఖ‌రారు చేస్తుంది. ఈ సెక్ష‌న్ కింద జీవిత ఖైదు లేదా మూడేళ్లు జైలు శిక్ష‌ను పేర్కొంటుంద‌ని.. దీనికి మ‌ధ్య‌లో ఏమీ లేద‌ని లా క‌మిష‌న్ గ‌తంలో నివేదిక స‌మ‌ర్పించింది. ఇక దేశ‌ద్రోహం కేసుల్లో శిక్ష జ‌రిమానా మాత్ర‌మేన‌ని తెలిపింది. భార‌త శిక్షా స్మృతిలోని చాప్ట‌ర్ -6లో పేర్కొన్న నేరాల‌కు సంబంధించిన శిక్ష‌ల‌కు.. సెక్ష‌న్ 124ఎ కింద పేర్కొన్న శిక్ష విష‌యంలో విస్ప‌ష్ట‌మైన అస‌మాన‌త ఉంద‌ని క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. చాప్ట‌ర్‌-6 కింద ఉన్న ఇత‌ర నేరాల‌కు సంబంధించి పేర్కొన్న శిక్ష‌ల‌కు అనుగుణంగా ఈ నిబంధ‌న‌ల‌ను సరిచేయాల‌ని తెలిపింది. అప్పుడు నేరం తీవ్ర‌త ఆధారంగా శిక్ష‌ల‌ను విధించ‌డానికి కోర్టుల‌కు వీలుంటుంద‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

 

Leave A Reply

Your email address will not be published.