ఒడిశా రైలు ప్రమాదం: రక్తదానం చేయడానికి స్వచ్చందంగా వచ్చిన యువకులు
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/odisha-train-accident-4.jpg)
బాలేశ్వర్ (CLiC2NEWS): ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ఆస్పత్రులలో చికిత్సనందిస్తున్నారు. వారిలో అవసరమైన వారికి రక్తదానం చేయడానికి స్థానిక యువత స్వచ్చందంగా ముందుకొచ్చారు. రైలు ప్రమాదంలో సుమారు 900 మందికిపైగా గాయాలపాలైనట్లు సమాచారం. వీరంతా బాలేశ్వర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి రక్తం అవసరమవుతుందని ఆలోచించిన యువత .. ఆస్పత్రికి చేరుకుని, క్యూలైన్‌లలో నిల్చుని మరీ.. రక్తదానం చేస్తున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొని దాదాపు 200-300 మందిని రక్షించామని స్థానికులు చెబుతున్నారు.